Train Of Thoughts
My discourses. అనగా నా ముచ్చటలు
దీన** జీవితం.
పక్కోడు కాపీ కొడతాడు. నువ్వు దొరికిపోతావు.
జపాన్లో సునామీ వస్తుంది. ఇక్కడ నీ జాబ్ పోతుంది.
పక్కింట్లో కొత్త టి.వి. కొంటారు. నీకు తలనొప్పి వస్తుంది
గ్రీస్ లో ఎన్నికల ఫలితాలు వస్తాయి. నీ సేవింగ్స్ సున్నా అవుతాయి.
మున్సిపాలిటీ వాళ్ళు గోతులు తీస్తారు. నువ్వు అందులో పడతావు.
అమెరికా, ఇరాన్ మధ్య గొడవ అవుతుంది. దెబ్బతో నీ బండిలో పెట్రోల్ ఆవిరి అయిపోతుంది.
నువ్వు పన్ను కడతావు. దాన్ని ఎవడో మింగేస్తాడు.
డ్రైవరు తాగి బస్ నడుపుతాడు. నీ ప్రాణాలు పోతాయి.
థూ.... దీన** జీవితం!!!
శ్రీరాముడు-చారు.
శ్రీ రఘురామ! చారుతులసీదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ ! భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!!
తాత్పర్యం:
శ్రీరఘురామ = శ్రీరాములవారు చారు = ఒక రోజు జ్వరం వచ్చి చారు కాపించుకున్నారు. తులసిదళధామ = ఆ దేశములో కరివేపాకు లేకపోవడంతో తులసాకులు వేసి పొంగించారు. శమక్షమాది శృంగార గుణాభిరామ = శ్రమయావత్తూ పోగొట్టగలిగి బహుశృంగారంగా ఉందా చారు. త్రిజగన్నుత శౌర్యరమాలలామ = ఆ చారు తాగిన తర్వాత రాములవారికి రాక్షసులు అందరినీ చంపగలిగిన శౌర్యం కలిగింది. జగజ్జన కల్మషార్ణవో తారక రామ = ఆచారు తారక మంత్రములా త్రాగిన జనులందరకు కల్మషము కొట్టివేసినది. దుర్వారకబంధ రాక్షస విరామ = దాంతో వారికందరకు కఫం పట్టకుండా పోయింది. భద్రగిరి = వారికి ఎంతో భద్రం కలిగినది.
-- చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి "గణపతి" నుండి.

What a day!
Today I got a call from bank asking to come and sign documents to slash interest of EMI by 5%. On the way a petrol pump charged just Rs.25 per liter. At bank, my boss called and informed that I got 50% Hike. After coming back fuel meter of car showed consumption of 1 liter for 30 km and at door step, found a bunch of red roses and a lovely card from a beautiful girl. --- If all dreams are as beautiful, I'd like to sleep 24 Hrs a day!!
ప్రేమ్ 'థూ' మీ లక్స్-మి
టెల్గుజాతి షేషుకున్న పుణ్యఫల్మ్ వల్ల మన్కి దొరికిన ఆనీముత్యలాంటి ఎండరో గొప్పవాల్ల గురిన్షి ప్రథి వీక్ తెల్స్కుంతుంటే ఛాలా హాప్పీగా ఉంటోంది, ఎవ్రి వీక్ ఒక అంకుల్ లేదా ఆంటీ, వాల్ల experiences చెప్తుంటే త్రిల్లింగ్ గా ఉంది. లైఫ్ లో ఇన్ని రోజ్లు ఏం మిస్ అయ్యానో ఇప్పుడు టెల్సి ఫీలయితుంటే emotions ఖేల్గుతున్నయి.
suddenగా వీడికి ఏమయింది? ఇలా అయిపోయాడు అనుకుంటున్నారా? ఇదంతా ఒక మాయ... మంచుకొండల్లో తేలిపోతున్న అనుభూతి... తన అయస్కాంతపు చూపులతో ఇనుములో హృదయం మొలిపించ గలిగిన ఓ సూపర్ గాల్ చేసిన మ్యాజిక్. దరిద్రపుగొట్టు ఉద్యోగం వల్ల ఎన్నో ఏళ్లుగా అసలు టివి మొహం కూడా చూడని నాకు ఉన్నట్టుండి, "మంచు ఖుర్షే వేళలో టివి షూషేదెందుకో..." అని పాడుకుంటూ, చూసిన Episodesని నెట్ లో వెతుక్కొని మరీ మళ్ళీ మళ్ళీ చూసేలా, ఒక ప్రసన్న వదనురాలు చేసిన ఇంద్రజాలం. ఇంకా ఎవరి గురించి చెప్తున్నానో వెలగలేదా? ఎవరబ్బా!! అని నెత్తిన ఉన్న నాలుగు వెంట్రుకలు పీకేసుకొని, కురిడి కొబ్బరి లాంటి తలలో ఐడియాలు ఎలా వస్తాయి అని మధన పడక ముందే చెప్పేస్తా. ఎవరో కాదు “ఖలామందిర్ ప్రేమతో మీ లక్స్-మి” టాక్ షో నిర్వహించు మన మోహన్ బాబు గారి అమ్మాయి, మంచు లక్ష్మీ ప్రసన్న.
అసలు మన లక్స్-మి వాడే భాష, యాసల్లో ఉన్న సొగసులు చూస్తే మతిలేని నాలాంటి మందమతులకు కూడా మతి పోవడం ఖాయం. లక్స్-మి వాడే 'వొచ్షి ఖాల్లు ఖడుక్కోవాలి'... 'ఒళ్లు మీద కూర్చోబెట్టుకున్నారు'... వంటి అద్భుత ప్రయోగాలు, పలికే విధానం మంచుకొండల్లో జారిపడే సెలయేళ్ల గలగలలా వినసొంపుగా ఉంటుంది.
పదేళ్ళ లోపు పిల్లలు ఒత్తులు, పొల్లులు సరిగా చెప్పకపోతేనే కోపంతో పళ్ళు నూరేసే ఎస్.పి.బాలు అంకుల్ తో కూడా 'నా తెలుగు దారుణంగా ఉంటుంది..ఏమీ అనుకోకండి' అని చెప్పి, అసలు ఒక్క తిట్టు కూడా తిట్టకుండా "మాట్లాడుతున్నావ్ కదా, అది చాలు" అనిపించ గలిగిన గొప్పతనం ఎంతమందికి ఉంటుంది?
వాళ్ళ నాన్న తో act చేసిన పాపానికి "సౌందర్య ఆంటీకి మీరే చెప్పారా?” అని heroinesని ఆంటీ అని పిలవగలిగిన సంస్కారం ఎంత మందికి ఉంటుంది? రామ్ చరణ్, జూ. ఎన్‌టిఆర్, నాగ చైతన్య లాంటి కుర్ర హీరోలు వల్ల నాన్నల పక్కన Act చేసిన heroinesని గౌరవభావంతో పబ్లిక్ గా పిలిచిన దాఖలాల్లేవు. కనీసం వల్ల తాతలతో నటించిన వాణిశ్రీ, శ్రీదేవి లాంటి వాళ్ళని కూడా ప్రేమతో తెలుగులో 'నాయనమ్మా...' అని కూడా ఎప్పుడూ పిలవలేదు.
అన్నిటి కంటే హైలైట్, షో మొదలు పెట్టి పెట్టగానే మంచమ్మాయి చెప్పే స్త్రీ-సూక్తాలు. అసలు బ్రతకడమే waste అని ఫీల్ అయ్యే నాలాంటి వాళ్ళకి అవి redbull తాగినంత energy ఇస్తాయి. అసలు inspire చెయ్యడం ఎలాగో మన లక్స్-మి కి తెలిసినంత బాగా ఏ psychologist కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో?
నేను ఏదో నా style లో వెటకారం చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు బాబూ...(మగువలు, 'పాపా' అని చదువుకోండి) కానే కాదు. ఈ లంకె చూస్తే అది ఎంత పచ్చి ట్రూతో తెలుస్తుంది. ఇలా కోన్ కిస్కా గొట్టం site చెప్తే మేము నమ్మం అంటారా... పోనీ అందరికీ తెలిసిన మన మల్లిక్ గారి teluguone ఏం చెప్పిందో చూస్తారా?
ఆ తేనెలూరే యాసకు, ముద్దులోలికే పలుకులకు, చిలుకల కులుకులకు నాలా మీరు కూడా వెర్రి అభిమానులయితే మీ కోసమే ఈ website .

నోరు - The Mouth
గమనిక: ఈ టపా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఎవరయినా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాశాననుకుంటే అది వాళ్ళ ఖర్మ.
ఓరేయి చెప్పినా వినకుండా తెల్లచొక్కా వేసుకున్నావు. మాసిపోగలదు చూసుకో...
               నాలుగడుగులు వేసి సందు తిరగగానే నల్లకాకి చల్లగా రెట్ట వేస్తుంది.
అబ్బో చాలా బాగా చదివినట్లున్నావు? ఈ సారి నీకు క్లాస్ గారెంటీ...
               క్లాస్ సంగతి దేవుడెరుగు. నెల తర్వాత పేపర్లో నంబర్ కనపడదు.
ధోని బాగా ఆడుతున్నాడు. సమస్యే లేదు హండ్రెడ్ కొడతాడు.
               తర్వాత ఓవర్లో ధోని clean bowled!
మీ అబ్బాయికి నెలకి 80వేలు జీతమటకదా? రాజభోగం అనుభవిస్తున్నాడు
               అంతే వారంరోజుల్లో అబ్బాయి జాబ్ జంప్!
ఏంటి పక్కింటి పిన్నిగారు కొత్త పట్టుచీర కొన్నారట కదా? దాని అంచు ఎంత బాగున్దో..!
               మర్నాడు ఉతకడానికి వేసిన పిన్నిగారి చీర తిరిగిరాదు.
కొత్త బైక్ అనుకుంటా? License ఉందా?
               Gone Case! వీధిచివరలో policeకి వంద సమర్పయామీ!!!
2nd Year షీలాకి లైన్ వేస్తున్నావట? వాళ్ళ అన్నకి కనిపించావో అంతే!
           సాయంత్రం బీచ్ లో చేతిలో ఐస్-క్రీమ్, పక్కన షీలా, ఎదురుగా షీలా అన్న!!
ఈ రోజు Train రైట్ టైమ్. అప్పుడే చెర్లపల్లి క్రాస్ అయిపోయింది.
               కానీ అక్కడ నుంచి సికింద్రాబాద్ రెండు గంటలు పడుతుంది.
సినిమా కోసం X-roadsకి వెళుతున్నావా? అక్కడ నీకు జన్మలొ Tickets దొరకవు.
               అన్నాక ఇంకేం దొరుకుతాయి. కాళ్ళు ఈడుస్తూ ఇంటికి తిరిగిరావడమే!
4overs, 10runs కావాలి. 5wickets ఉన్నాయి. ఇండియా ఎప్పుడూ ఇలాంటి stageలో ఓడిపోతుంది. -- నిజమే ఇండియా ఓడిపోయింది!!!
ఇలాంటి tongues బోలెడు. వాటన్నిటికీ శతకోటి నమస్కారాలు.

వసుదేవుడు -- గాడిద కాళ్ళు.
వెనకటికి ఒక సామెత ఉండేది. అవసరానికి వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని (తెలియని వాళ్ళకి: వసుదేవుడు అంటే లార్డ్ కృష్ణ ఫాదర్). మనం అంత గొప్పవాళ్ళం కాదు కనుక ఏదో మన rangeలో అప్పుడప్పుడు, తప్పని పరిస్థితిలో చుట్టుపక్కల ఉన్న కొన్ని అడ్డగాడిదల కాళ్ళు పట్టుకుంటున్నాం. Trafficలో దొరికిపోయినప్పుడు case లేకుండా పోలీస్ కాళ్ళు, లైన్లో టికెట్స్ దొరకనప్పుడు blackలో అమ్మెవాడి కాళ్ళు, Government officeలో పనులు పూర్తవ్వడానికి attender కాళ్ళు etc. etc.
ఇలా పట్టుకొని పట్టుకొని మనకి అలవాటు అయిపోయింది. కాని కలియుగంలో గాడిదలు కాళ్ళతో సరిపెట్టుకోవు. వాటికి కడుపునిండా గడ్డి కూడా పెట్టాలి. గడ్డితిని ఇవి కడివెడు ఖరము పాలు మనకు ప్రసాదిస్తాయి. వాటినే మనం తీర్థప్రసాదాల్లా భావించి మన luckకి పొంగిపోతూ స్వీకరించాలి. కాదు కూడదు నేను గాడిదలను బ్రతిమిలాడను, అంటేమాత్రం మీరు మూడు చెరువుల నీళ్ళు తాగాల్సిందే. కొన్ని గాడిదలు మహామొండివి ఉంటాయి. అవి గడ్డితింటూ కూడా నీతులు చెప్తుంటాయి. చెప్తూపోతే వాటి లీలలు కోకొల్లలు.
ఇన్ని గాడిదల మధ్య ఎప్పుడో 60ఏళ్లకోసారి అన్నాహజారేలా 121కోట్లలో ఒకడు, నాలుగురోజులు తిండి మానేసి కూర్చుంటే గాడిద గడ్డితినడం మానెస్తుందనుకోవడం అత్యాశ అవుతుంది. అయినా మనం చెయ్యగలిగింది ఏముంది? తింటే గడ్డి పెడతాం. లేదంటే కాళ్ళు పడతాం. మనకి పని అవ్వడం important. ఎలా అయింది అని కాదు.ఇప్పటికీ ఏం చెయ్యాలో తోచకపోతే కొసమెరుపుగా భాస్కరశతకములోని ఈ పద్యం చదువుకోండి....
ఘనుడగునట్టివాడు నిజ కార్యసముద్ధరణార్థమై మహిం
బనివడి యల్పమానవుని బ్రార్థనజేయుట తప్పుగాదుగా,
యనఘతగృష్ణజన్మమున నా వసుదేవుడు మీదటెత్తుగా
గనుగొని గానివాడకడ కాళ్ళకు మ్రొక్కడెనాడు భాస్కరా!
తా. కృష్ణుడు జన్మించగానే యతనిని గంసునివలన బాధలేకుండ జేయ వ్రేపల్లెకు దీసికొనపోవనెంచి కావలివారికిం దెలియకుండబోవుచు దానొనరించు పనికంతరాయము గలుగుకుండుటకయి గాడిదకాళ్ళకు వసుదేవుడు మ్రొక్కినట్లే, ప్రపంచమున మనుష్యుడు తన పని నెఱవేర్చుకొనుటకొక యల్పుని బ్రార్థించినను దానివలన దోషములేదు.

రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఖద
Subscribe to:
Posts (Atom)