Ramadasu kirthana.

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్త దాయ మహిత మంగళం
కొసలేశాయ మంద హాస దాస పొషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం
చారు మేఘ రూపాయ చందనాది చర్చితాయ భాన కటక శోభితాయ భూరి మంగళం
లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ జలజ ఘతుక దేహాయ చారు మంగళం
దేవకీ సుపుత్రాయ దేవ దేవోదత్తమాయ పవనా గురువరాయ సర్వ మంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ అండజా వాహనాయ అతుల మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయా సుముఖ చిత్త కామితాయ శుభ మంగళం
రామదాసాయ మ్రుదుల హ్రిదయ కమల వాసాయ స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం

జీవితం....

ఎవరు చెసిన కర్మ వారు అనుభవింపక ఏరికినను తప్పదన్న....
ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్న...
రాముడంటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెనన్నా...
ఆనాటి పాండవులు ఆకులలములు మేసి అడవిపాలు అయిపొయెనన్న...
నా ఒళ్ళు బరువుకు నెనేడ్వవలెను గాని ఒరులెందుకెద్తురోరన్నా....

(Keelugurram lo oka manchi paata)