పంద్రాగస్టు...


ఈ రోజు పొద్దున్నే నిద్ర లేవగానే ఓ పెద్ద doubt వచ్చింది. అసలు ప్రతి ఏడు మనం స్వతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి? -నాకు తెలిసి ఇవి దేశం మొత్తానికీ పండుగ రోజులు కనుక. హిందూ,ముస్లిం, క్రైస్తవ, సిక్కు, పార్సి ఇలా మతాలు ఏవయినాగాని ఈ పండుగలు మన దేశ సంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనవి కనుక...

మరి అలాంటి పండుగను అందరు ఎంతొ ఆనందంతో జరుపుకోవాలి. కాని మిగిలిన పండుగల లాగా ఈ పండగలని మాత్రం విసుక్కోకుండా చేసేవాళ్ళు చాలా అరుదు. పంద్రాగస్టు నాడు పొద్దున్నే జెండా వందనానికి రమ్మంటే రాని మహానుభావులు ఎందరో. చిన్నప్పటి నుంచి చాలాసార్లు గమనించాను. దీనికి కారణం మతంపై ఉన్న నమ్మకం, భయం, భక్తీ దేశంపై లేవనుకోవాలా? (తప్పు లేదు లెండి!) లేదంటే – ’లైట్’లే అని గుర్రుపెట్టి తొంగుంటున్నారా?

అలాగే, పెద్ద ఎమ్మెన్సీల్లో కొన్నింటిలో పంద్రాగస్టు సెలవు దినం మాత్రమే. కనీసం జెండా వందనమన్నా చేస్కోవాలి కదా. ఇవ్వాళ అయితె ఆదివారమనుకొండి కానీ నాకు తెలిసి ఐటీ ఆఫీసుల్లో సెలవుల Listలొ ఇది కూడా ఒకటి అంతే. చిన్నప్పుడు, మా స్కూల్లో జండా వందనంతొ పాటు మా Apartmentలో, నాన్న Officeలో కూడా జెండా వందనానికి వెళ్ళేవాళ్ళం. తరువాత మాత్రం అప్పుడప్పుడూ కాలేజీలో వెళ్ళేందుకు బద్దకమనిపించి మానేసిన సందర్భాలు ఇక్కడ అప్రస్థుతం.

నా విషయానికొస్తే, నాలో దేశభక్తి చాలా తక్కువ. ఏదో, అప్పుడప్పుడు Cinemaచూసి దేశం కోసం పనులు చేయాలి అనుకుంటా తప్పిస్తే, అంతకుమించి నాకు దేశభక్తేమీలేదూ.. అయినప్పటికీ, పంద్రాగస్టు మాత్రం పండుగే అన్న ఫీల్ ఉండిపొయింది.

మరి ఈ పండుగకి నావంతు నేను ఏం చెప్పాలి? అలా అలొచిస్తే ఈ మంచి పాట దొరికింది. అది మీతొ పంచుకుంటే పాచిమొహంతొ T.V.లొ జండావందనం చూసిన నా పాపానికి కొంచం ప్రాయశిత్తం చేసుకోవచ్చు అనిపించి...

(Click play button after turning your speakers/Head Phones to ON)