ఓ రెండు మంచి పద్యాలు....

సమాజంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవలసిన రెండు విషయాలు...

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

వినదగు నెవ్వరు జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప దగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ !