ప్రేమ్ 'థూ' మీ లక్స్-మి

టెల్గుజాతి షేషుకున్న పుణ్యఫల్మ్ వల్ల మన్కి దొరికిన ఆనీముత్యలాంటి ఎండరో గొప్పవాల్ల గురిన్షి ప్రథి వీక్ తెల్స్కుంతుంటే ఛాలా హాప్పీగా ఉంటోంది, ఎవ్రి వీక్ ఒక అంకుల్ లేదా ఆంటీ, వాల్ల experiences చెప్తుంటే త్రిల్లింగ్ గా ఉంది. లైఫ్ లో ఇన్ని రోజ్లు ఏం మిస్ అయ్యానో ఇప్పుడు టెల్సి ఫీలయితుంటే emotions ఖేల్గుతున్నయి.

suddenగా వీడికి ఏమయింది? ఇలా అయిపోయాడు అనుకుంటున్నారా? ఇదంతా ఒక మాయ... మంచుకొండల్లో తేలిపోతున్న అనుభూతి... తన అయస్కాంతపు చూపులతో ఇనుములో హృదయం మొలిపించ గలిగిన ఓ సూపర్ గాల్ చేసిన మ్యాజిక్. దరిద్రపుగొట్టు ఉద్యోగం వల్ల ఎన్నో ఏళ్లుగా అసలు టి‌వి మొహం కూడా చూడని నాకు ఉన్నట్టుండి, "మంచు ఖుర్షే వేళలో టి‌వి షూషేదెందుకో..." అని పాడుకుంటూ, చూసిన Episodesని నెట్ లో వెతుక్కొని మరీ మళ్ళీ మళ్ళీ చూసేలా, ఒక ప్రసన్న వదనురాలు చేసిన ఇంద్రజాలం. ఇంకా ఎవరి గురించి చెప్తున్నానో వెలగలేదా? ఎవరబ్బా!! అని నెత్తిన ఉన్న నాలుగు వెంట్రుకలు పీకేసుకొని, కురిడి కొబ్బరి లాంటి తలలో ఐడియాలు ఎలా వస్తాయి అని మధన పడక ముందే చెప్పేస్తా. ఎవరో కాదు “ఖలామందిర్ ప్రేమతో మీ లక్స్-మి” టాక్ షో నిర్వహించు మన మోహన్ బాబు గారి అమ్మాయి, మంచు లక్ష్మీ ప్రసన్న.

అసలు మన లక్స్-మి వాడే భాష, యాసల్లో ఉన్న సొగసులు చూస్తే మతిలేని నాలాంటి మందమతులకు కూడా మతి పోవడం ఖాయం. లక్స్-మి వాడే 'వొచ్షి ఖాల్లు ఖడుక్కోవాలి'... 'ఒళ్లు మీద కూర్చోబెట్టుకున్నారు'... వంటి అద్భుత ప్రయోగాలు, పలికే విధానం మంచుకొండల్లో జారిపడే సెలయేళ్ల గలగలలా వినసొంపుగా ఉంటుంది.

పదేళ్ళ లోపు పిల్లలు ఒత్తులు, పొల్లులు సరిగా చెప్పకపోతేనే కోపంతో పళ్ళు నూరేసే ఎస్‌.పి.బాలు అంకుల్ తో కూడా 'నా తెలుగు దారుణంగా ఉంటుంది..ఏమీ అనుకోకండి' అని చెప్పి, అసలు ఒక్క తిట్టు కూడా తిట్టకుండా "మాట్లాడుతున్నావ్ కదా, అది చాలు" అనిపించ గలిగిన గొప్పతనం ఎంతమందికి ఉంటుంది?

వాళ్ళ నాన్న తో act చేసిన పాపానికి "సౌందర్య ఆంటీకి మీరే చెప్పారా?” అని heroinesని ఆంటీ అని పిలవగలిగిన సంస్కారం ఎంత మందికి ఉంటుంది? రామ్ చరణ్, జూ. ఎన్‌టి‌ఆర్, నాగ చైతన్య లాంటి కుర్ర హీరోలు వల్ల నాన్నల పక్కన Act చేసిన heroinesని గౌరవభావంతో పబ్లిక్ గా పిలిచిన దాఖలాల్లేవు. కనీసం వల్ల తాతలతో నటించిన వాణిశ్రీ, శ్రీదేవి లాంటి వాళ్ళని కూడా ప్రేమతో తెలుగులో 'నాయనమ్మా...' అని కూడా ఎప్పుడూ పిలవలేదు.

అన్నిటి కంటే హైలైట్, షో మొదలు పెట్టి పెట్టగానే మంచమ్మాయి చెప్పే స్త్రీ-సూక్తాలు. అసలు బ్రతకడమే waste అని ఫీల్ అయ్యే నాలాంటి వాళ్ళకి అవి redbull తాగినంత energy ఇస్తాయి. అసలు inspire చెయ్యడం ఎలాగో మన లక్స్-మి కి తెలిసినంత బాగా ఏ psychologist కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో?

నేను ఏదో నా style లో వెటకారం చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు బాబూ...(మగువలు, 'పాపా' అని చదువుకోండి) కానే కాదు. ఈ లంకె చూస్తే అది ఎంత పచ్చి ట్రూతో తెలుస్తుంది. ఇలా కోన్ కిస్కా గొట్టం site చెప్తే మేము నమ్మం అంటారా... పోనీ అందరికీ తెలిసిన మన మల్లిక్ గారి teluguone ఏం చెప్పిందో చూస్తారా?

ఆ తేనెలూరే యాసకు, ముద్దులోలికే పలుకులకు, చిలుకల కులుకులకు నాలా మీరు కూడా వెర్రి అభిమానులయితే మీ కోసమే ఈ website .

10 comments:

Anonymous said...

http://vbsowmya.wordpress.com/2011/08/27/manchammai-again/

Unknown said...

మాష్టారూ!!! ఏదో మీరు అనాలని అంటారు గానీ... ఆ మాత్రం accent దట్టించకపోతే, అమెరికాలో ఉండొచ్చిన "మంచు లక్ష్మి"కి అమలాపురంలో పుట్టి పెరిగిన మీ పక్కింటి "చెంచులక్ష్మి"కి తేడా ఏముంటుంది??? :-P

Unknown said...

@ Anonymous: అయ్యా/అమ్మా...(gender తెలుసుకోలేక పోయా sorry!!) ఈ పోస్ట్ కి సౌమ్య గారి బ్లాగ్ ప్రేరణ. ఒక రకంగా అక్కడ నుంచే కొన్ని వాక్యాలు వాడుకున్నాను అని చెప్పాలి. కానీ నా tone వేరు. సౌమ్యగారికి లక్ష్మి నషలెదు... నేను లక్స్-మి కి పిచ్చ fanని. ఆమె తిడుతూ రాశారు. నేను మంచమ్మాయిలో positives వెతికా... అదే తేడా.

శశి కళ said...

ఆహా...యెన్త పొసిటివ్...యెన్త అభిమాన్నం ..
లక్స్..మి...మీద ...యెన్త తెలుగు గుండె
మొరి...అయిపొతుంది.

రాజ్ కుమార్ said...

kekaa post.. ;)

Anonymous said...

ROFL!

Anonymous said...

Very nice.:)Rofol

LalithaTNV said...

Very nice.:)Rofol

S said...

ఏవండోయ్! మీరెవరో గానీ, నా అభిమానాన్ని అవమానిస్తున్నారు. మీరు మామూలు అభిమానులో, వీరాభిమానులో కావొచ్చు కానీ, నేను మిమ్మల్ని మించిన దురభిమానిని. అసలు ఒక్క వాక్యం చూపండి..మా అయస్కాంత దేవతని తిట్టిన సందర్భం?? నా కళ్ళజోడు పెట్టుకుని చూడండీ!! :)

Unknown said...

లేదండీ! మీ అభిమానాన్ని నేను అవమానించలేదు. కేవలం పోలికలు వెతికా... అంతే!! మన మంచమ్మాయి మీదోట్టు. అభిమానం ఉన్న చోట కేవలం అనురాగాలే ఉంటాయి. అనుమానాలు, అవమానాలు కాదు.