గమనిక: ఈ టపా ఎవరిని ఉద్దేశించినది కాదు. ఎవరయినా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాశాననుకుంటే అది వాళ్ళ ఖర్మ.
ఓరేయి చెప్పినా వినకుండా తెల్లచొక్కా వేసుకున్నావు. మాసిపోగలదు చూసుకో...
               నాలుగడుగులు వేసి సందు తిరగగానే నల్లకాకి చల్లగా రెట్ట వేస్తుంది.
అబ్బో చాలా బాగా చదివినట్లున్నావు? ఈ సారి నీకు క్లాస్ గారెంటీ...
               క్లాస్ సంగతి దేవుడెరుగు. నెల తర్వాత పేపర్లో నంబర్ కనపడదు.
ధోని బాగా ఆడుతున్నాడు. సమస్యే లేదు హండ్రెడ్ కొడతాడు.
               తర్వాత ఓవర్లో ధోని clean bowled!
మీ అబ్బాయికి నెలకి 80వేలు జీతమటకదా? రాజభోగం అనుభవిస్తున్నాడు
               అంతే వారంరోజుల్లో అబ్బాయి జాబ్ జంప్!
ఏంటి పక్కింటి పిన్నిగారు కొత్త పట్టుచీర కొన్నారట కదా? దాని అంచు ఎంత బాగున్దో..!
               మర్నాడు ఉతకడానికి వేసిన పిన్నిగారి చీర తిరిగిరాదు.
కొత్త బైక్ అనుకుంటా? License ఉందా?
               Gone Case! వీధిచివరలో policeకి వంద సమర్పయామీ!!!
2nd Year షీలాకి లైన్ వేస్తున్నావట? వాళ్ళ అన్నకి కనిపించావో అంతే!
           సాయంత్రం బీచ్ లో చేతిలో ఐస్-క్రీమ్, పక్కన షీలా, ఎదురుగా షీలా అన్న!!
ఈ రోజు Train రైట్ టైమ్. అప్పుడే చెర్లపల్లి క్రాస్ అయిపోయింది.
               కానీ అక్కడ నుంచి సికింద్రాబాద్ రెండు గంటలు పడుతుంది.
సినిమా కోసం X-roadsకి వెళుతున్నావా? అక్కడ నీకు జన్మలొ Tickets దొరకవు.
               అన్నాక ఇంకేం దొరుకుతాయి. కాళ్ళు ఈడుస్తూ ఇంటికి తిరిగిరావడమే!
4overs, 10runs కావాలి. 5wickets ఉన్నాయి. ఇండియా ఎప్పుడూ ఇలాంటి stageలో ఓడిపోతుంది. -- నిజమే ఇండియా ఓడిపోయింది!!!
ఇలాంటి tongues బోలెడు. వాటన్నిటికీ శతకోటి నమస్కారాలు.
2 comments:
బావుంది విశ్శు. ప్రతీరొజూ 'ముచ్చట్లని' భలే అందంగా చెప్తావు నువ్వు. :)
అది నోరా మూసీ నదా!! :P
Post a Comment