మళ్లీ రాయాలి అనిపిస్తోంది. ఆనందం ఆవిరి అయ్యేదాకా, కన్నీళ్ళు ఇంకే దాకా, గుండె బరువు దిగే దాకా, ఊపిరి ఆగే దాకా రాస్థునే ఉండాలి అనిపిస్తోంది. కాని రాయడానికి మనసులో భావాలూ లేవు. ఆలోచనలు లేవు. ఆవేశం లేదు. అంతా శూన్యం, నిస్సారం, నిస్తేజం.
ఇది యోగామా, రోగమా, ఏమో మాయాజలమా, నేను ఋషిగా మారానా, ఆలోచించడం మరచిపోయనా, ఎందుకీ ఆవేదన, నేను ఏం కోల్పోయాను? కోరికలను జయించానా? వాటికీ లొంగిపోయనా? ఏంటి నా స్థితికి కారణం? ఇది జవాబు లేని ప్రశ్నా? లేదా ప్రశ్నించలేని జవాబా?
అసలు నాలో జీవం ఉందా? నేను జీవన్మ్ర్తుడినా? మృతజీవినా? అసలు నేను నేనేనా ?
No comments:
Post a Comment